: కేసీఆర్ కాన్వాయ్ దారితప్పింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ దారితప్పింది. దీంతో కాన్వాయ్ ను అనుసరించాల్సిన సీఎం కారు ముందుకు వెళ్లగా, సీఎం కారును కాన్వాయ్ అనుసరించింది. కేసీఆర్ హుస్సేన్ సాగర్ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, జలవిహార్, సుందరయ్యపార్కు లను పరిశీలించారు. తరువాత సీఎం వాహనానికి ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాలు ఎడమవైపుకు తిరిగి మినిస్టర్ క్వార్టర్స్ రోడ్ లోకి వెళ్లాయి. సీఎం వాహనం వాటిని అనుసరించకుండా నేరుగా వెళ్లి బుద్ధభవన్ వద్ద యూటర్న్ తీసుకుంది. వెనుక సీఎం రావడం లేదని చూసుకున్న ఎస్కార్ట్ సిబ్బంది తేరుకుని సీఎం కాన్వాయ్ ను అందుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఎస్కార్ట్ వాహనం ఆయనను అనుసరించింది.