: మహారాష్ట్రలో ఓట్లు, ట్వీట్ల హంగామా
మహారాష్ట్రలో ఓట్లు, ట్వీట్ల హంగామా నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు సెల్ఫీలతో ట్విట్టర్లో హంగామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "వెళ్లండి, మహారాష్ట్ర ఎన్నికల్లో సిరా గుర్తును వేయించుకోండి" అంటూ రేణుకా షెహనాయ్ పేర్కొనగా, నకుల్ మెహతా "సొంత చేత్తో తప్పు చేయకండి" అంటూ ట్వీట్ చేశాడు. పూజాబేడీ, పోలింగ్ బూత్ లో అభిమాన నటుడు గుల్షన్ గ్రోవర్ ను కలిశానని, రీల్ లైఫ్ లో 'బ్యాడ్ మేన్' రియల్ లైఫ్ లో మంచిపని చేయడానికొచ్చాడని తెలిపింది. అనుపమ్ ఖేర్ ఓటేశానని ట్వీటాడు. "సిరా చుక్క వేయించుకోవడం మనందరి బాధ్యత, నేను వేయించుకొచ్చా, మరి మీరు?" అంటూ మందిరాబేడీ మరాఠాలను ప్రశ్నించారు. రాహుల్ మహాజన్ "నేనిప్పుడే ఓటేశా!మరి మీరు?" అంటూ ట్వీట్ చేశాడు. రేఖ, భాగ్యశ్రీ, వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్, రాహుల్ బోస్... తదితరులు సిరాగుర్తులు చూపుతూ ట్వీట్లు చేశారు.