: తుపాను సమాచార సేకరణ కోసం ఏపీ సర్కారు వెబ్ పోర్టల్
తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై సమాచారాన్ని సేకరించేందుకు, విశ్లేషించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. www.hudhud.ap.gov.in పేరుతో వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు ఈ సైట్ లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంటారు. ఈ పోర్టల్ ఎన్ఆర్ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ) అనుసంధానంతో పని చేస్తుందని అధికారులు తెలిపారు. అంతేగాక వాట్స్ యాప్ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన 7893699024, 8978208690 తదితర నంబర్లకు ప్రజలు తుపానుకు సంబంధించిన ఫోటోలను పంపాలని చెప్పింది.