: పాఠశాల స్థలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు దొరికాయి
మహబూబ్ నగర్ జిల్లాలోని మల్దకల్ మండలం నీలిపల్లిలో పాఠశాల అదనపు గదుల నిర్మాణం కోసం స్థలాన్ని చదును చేస్తుండగా వెయ్యి వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణాలు 1840వ సంవత్సరానికి చెందినవి. వీటిపై విక్టోరియా రాణి ముఖచిత్రం ముద్రించి ఉందని పాఠశాల సిబ్బంది తెలిపారు. వీటిని రెవెన్యూ అధికారులకు అందజేశారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. వాటిని ప్రభుత్వానికి అప్పగించిన పాఠశాల సిబ్బందిని అభినందించారు.