: ప్రజల నుంచి వందల కోట్లు సంపాదించి... లక్షలు మాత్రమే విదిలిస్తారా?: హీరోలపై వర్మ సెటైర్లు


తుపాను బాధితుల సహాయార్థం సినీ హీరోలు తమకు తోచిన విరాళాలు ప్రకటిస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అయితే, హీరోల విరాళాలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వందల కోట్లు సంపాదిస్తున్న హీరోలు... కేవలం కొన్ని లక్షలు మాత్రమే వారికి తిరిగి ఇస్తున్నారు అంటూ వర్మ ట్వీట్ చేశారు. మరో వైపు దేవుడిని కూడా వర్మ వదల్లేదు. విధ్వంసాలు అనేవి దేవుడి సృష్టే అయితే... ఇంతటి విధ్వంసం నుంచి దేవుడు ఏం ఆనందం పొందుతాడని వర్మ ప్రశ్నించారు. వైజాగ్ లో ఉన్న వారందరూ పాపాలు చేశారని తాను భావిచడం లేదని... అలాంటిది విశాఖ వాసులందరినీ దేవుడు ఎలా శిక్షిస్తాడని ట్వీట్ చేశారు. అయితే, తనకంటే దేవుడికే ఎక్కువ తెలుసని... తాను కేవలం సామాన్య మానవుడినేనని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News