: పోలీస్ కమిషనర్ కావాలన్న ఆ బాలుడి కోరిక నెరవేరింది


హైదరాబాదు నగర పోలీస్ కమిషనర్ కావాలన్నది సాధిక్ అనే పదేళ్ల బాలుడి కోరిక. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతని ఆశను 'మేక్ ఏ విష్' స్వచ్ఛంద సంస్థ ద్వారా నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్వయంగా తెలుసుకున్నారు. వెంటనే పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన ఆ బాలుడు నగర పోలీస్ కమిషనర్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో సాధిక్ ఎంతో సంతోషపడ్డాడు. అటు బాలుడి తండ్రి పోలీస్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాలను మేక్ ఏ విష్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మీడియాకు వెల్లడించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తెలుసుకుంటూ అవి తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఖమ్మంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజ అనే బాలికకు సినీ నటుడు పవన్ కల్యాణ్ ను కలవాలన్నది కోరికని చెప్పారు. ఇందుకు పవన్ సహకరించాలని ఈ సందర్భంగా నిర్వాహకురాలు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News