: శశి థరూర్ మా 'ముఖ్యమైన నేత': కాంగ్రెస్
అధికార ప్రతినిధి పదవి నుంచి ఎంపీ శశిథరూర్ ను తొలగించిన ఒకరోజు తరువాత కాంగ్రెస్ స్పందించింది. ఆయన పార్టీ 'ముఖ్యమైన నేత' అని హస్తం అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ అన్నారు. ఆయనను తొలగించడం ముగిసిన అధ్యాయం అని పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ "థరూర్ పార్టీ ప్రధాన నేత. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆయన. తనకు తానుగా నిర్ణయాన్ని అంగీకరించినప్పుడు థరూర్ విషయాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరంలేదని అనుకుంటున్నా. ప్రస్తుతం అది ముగిసిన అంశం" అని అజోయ్ అన్నారు.