: విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్
హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ బయలుదేరారు. హైదరాబాదు నుంచి విజయవాడ వరకు విమానంలో వెళ్లిన ఆయన... గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు రోడ్డు మార్గంలో వెళుతున్నారు. మార్గమధ్యంలో రాజమండ్రి, కాకినాడల్లో బాధితులను పరామర్శిస్తారు. ఈ సాయంత్రానికి ఆయన విశాఖ చేరుకుంటారు. రేపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు.