: స్వచ్ఛ భారతం... మరెంతో దూరంలో లేదు: నాగార్జున
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ తో ‘పరిశుభ్రమైన భారత్’ కల మరెంతో దూరంలో లేదని టాలీవుడ్ హీరో నాగార్జున అన్నారు. అడాగ్ అధినేత అనిల్ అంబానీ, క్లీన్ ఇండియాలో పాలుపంచుకోవాలని నాగార్జునను కోరారు. దీనికి స్పందించిన నాగార్జున "విదేశీ పర్యటనల్లో పరిశుభ్రంగా ఉన్న కొన్ని దేశాలను చూసి ఆశ్చర్యపోతుంటాను. తాజాగా మోడీ క్లీన్ ఇండియా పిలుపుతో భారత్ కూడా పరిశుభ్ర దేశంగా అవతరించడానికి మరెంతో సమయం పట్టదు" అని నాగార్జున వ్యాఖ్యానించారు. క్లీన్ ఇండియాలో భాగస్వామిని చేసిన అనిల్ అంబానీకి ఈ సందర్భంగా నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు. వీలయినంత ఎక్కువ మందిని ఇందులో భాగస్వాములను చేస్తానని ఆయన చెప్పారు.