: ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్!
ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగాన్ ఈ ఏటి బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. తన తండ్రి జైలులో ఉండగా, తాను ఎదుర్కొన్న ఇతివృత్తం ఆధారంగా ‘ద న్యారో రోడ్ టు ద డీప్ నార్త్’ పేరిట రాసిన పుస్తకానికి ప్లనగాన్, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో రేసులో చివరి దాకా నిలిచిన భారత రచయిత కు అవార్డు దక్కకుండాపోయింది. ‘ద లైవ్స్ ఆఫ్ అదర్స్’ పుస్తకం రాసిన కోల్ కతా కు చెందిన నీల్ ముఖర్జీ చివరి ఆరుగురు పోటీదారుల్లో ఒకరిగా నిలిచినప్పటికీ, అవార్డును కైవసం చేసుకోలేకపోయారు. బుకర్ ప్రైజ్ కింద ప్లనగాన్ కు 50 వేల బ్రిటన్ పౌండ్లు బహుమతిగా లభించనున్నాయి. గతేడాది కూడా బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ లో చోటుదక్కించుకున్న భారత సంతతి రచయిత్రి ఝుంపా లాహిరి కూడా అవార్డును గెలుచుకోలేకపోయారు.