: మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ ప్రారంభం


మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గంట క్రితం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళి పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేసింది. నేటి సాయంత్రానికి ఈవీఎంలలో నిక్షిప్తం కానున్న ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 19న జరగనున్న కౌంటింగ్ లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News