: పెట్రోల్ పై లీటరుకు రూ. 1 తగ్గింపు, డీజిల్ ధర తగ్గింపు వాయిదా
పెట్రోల్ ధరలను తగ్గిస్తూ దేశీయ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై రూ. 1 తగ్గింపు ధరలను మంగళవారం అర్థరాత్రి నుంచి అమలు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు క్షీణించిన నేపథ్యంలో చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే, డీజిల్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని ఆయిల్ కంపెనీలు వాయిదా వేశాయి. లీటర్ డీజిల్ పై రూ. 3 తగ్గింపును అమలు చేయాలన్న చమురు సంస్థల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం అవసరమైన నేపథ్యంలో, ఈ నిర్ణయంపై వాయిదా వైపే కంపెనీలు మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే ఈ వారంలోనే డీజిల్ ధరల తగ్గింపు ప్రకటన కూడా వెలువడే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.