: 8 మంది ఉగ్రవాదుల కోసం 45 మిలియన్ డాలర్ల అమెరికా ఆఫర్!
తమ కరడుగట్టిన చర్యలతో ప్రపంచాన్నే హడలెత్తిస్తున్న ఎనిమిది మంది తీవ్రవాదుల ఆచూకీ కోసం అమెరికా భారీ ఆఫర్ నే ప్రకటించింది. ‘ఆల్ ఖైదా ఇన్ ద అరేబియన్ పెనిన్సులా’కు చెందిన ఈ ఎనిమిది మంది కీలక ఉగ్రవాదుల ఆచూకీ చెబితే, 45 మిలియన్ డాలర్ల రివార్డును అందజేయనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆల్ ఖైదా చీఫ్ నాసిర్ అల్-వాహిషి ఆచూకీ కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన అమెరికా, అదే సంస్థకు చెందిన ఏడుగురు కరడుగట్టిన తీవ్రవాదుల ఆచూకీ చెబితే 5 మిలియన్ డాలర్ల చొప్పున చెల్లిస్తామని వెల్లడించింది. సంస్థ దాడుల ప్రణాళికల రచనతో పాటు కొత్త నియామకాలు, దాడులను నాసిర్ పూర్తిగా తన కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నాడని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.