: ప్రియురాలితో విషం తాగించి, ప్రియుడ్ని ఉరేశారు


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో పరువు హత్యలు చోటుచేసుకున్నాయి. మొరాదాబాద్ జిల్లాలోని భర్తాల్ గ్రామంలో రాకేష్ సింగ్ (17), సుష్మ (15) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు, సోదరులు బయటకు వెళ్లడంతో రాకేష్ సింగ్, సుష్మ ఏకాంత సమయాన్ని వినియోగించుకుంటున్నారు. బయటి నుంచి వచ్చిన సుష్మ తండ్రి మఖాన్ సింగ్, ఆమె నలుగురు సోదరులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమైద్ వారిద్దరూ అభ్యంతరకర రీతిలో ఉండడం చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో రాకేష్ సింగ్ ను ఉరివేసి చంపేశారు. సుష్మతో బలవంతంగా విషం తాగించి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునే సరికి రాకేష్ మృతి చెందగా, సుష్మ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడడం లేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News