: పెద్దమనసు చాటుకున్న సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం... విరాళం 50 లక్షలు
సుందర విశాఖ నగరాన్ని హుదూద్ తుపాను అతలాకుతలం చేయడంతో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం బాధితులకు సహాయం చేసేందుకు నిర్ణయించుకుంది. విశాఖ పునర్నిర్మాణంలో తమ కుటుంబం వంతు సాయంగా 60 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ 15 లక్షల రూపాయలు విరాళం ప్రకటించగా, ఆయన కుమారుడు మహేష్ బాబు 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కృష్ణ భార్య, ప్రముఖ దర్శక, నటి విజయనిర్మల 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించి తమ గొప్పమనసు చాటుకున్నారు.