: తుపాను తాకిడి ప్రాంతాల్లో 1348 బస్సుల పునరుద్ధరణ
తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో బస్సు సేవలను చాలా వరకు పునరుద్ధరించామని ఆర్టీసీ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 80 శాతం ఆర్టీసీ సేవలు పునరుద్ధరించడంతో జిల్లా వ్యాప్తంగా 355 బస్సులను నడుపుతున్నామని అధికారులు చెప్పారు. విశాఖలో 84 శాతం ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించడంతో 893 బస్సులను నడుపుతున్నామని వారు స్పష్టం చేశారు.