: పొన్నాల తెలంగాణకు చేసిందేమీ లేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


తెలంగాణ పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను కరడుగట్టిన తెలంగాణ వాదినని, ఆ తరువాతే కాంగ్రెస్ వాదినని అన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టి కేవలం నాలుగు నెలలే అయ్యిందని, ఇంకాస్త సమయం ఇవ్వాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభంలో మొదటి ముద్దాయి టీడీపీ అయితే, రెండో ముద్దాయి కాంగ్రెస్ అని ఆయన నిందించారు. తన పార్టీ మార్పుపై ఊహాగానాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News