: ఈ నెల 19న జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్ష వాయిదా


ఈ నెల 19న జరగాల్సిన ఏపీపీఎస్సీ శాఖాపరమైన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర అతలాకుతలమవడంతో పరీక్ష కేంద్రాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. సిబ్బంది సహాయకచర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహించడం సరికాదని వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తిరిగి ప్రకటిస్తామని ఏపీపీఏస్సీ తెలిపింది.

  • Loading...

More Telugu News