: 'ఇదేంటి నాయనా?' కథనం ఎఫెక్ట్... కర్నూలు ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడి


పెన్షన్ల పంపిణీలో అవకతవకలను ఎత్తిచూపుతూ 'ఇదేంటి నాయనా?' శీర్షికతో ఆంధ్రజ్యోతి కర్నూలు జిల్లా ఎడిషన్ లో ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై నంద్యాల మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ తులసీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 మంది అనుచరులతో కలసి వచ్చి కర్నూలులోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేశారు. సిబ్బంది సెల్ ఫోన్లను లాగేసుకుని, దుర్భాషలాడారు. ఆఫీసు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News