: విండీస్ తో మిగతా వన్డేలకు టీమిండియాలోకి అక్షర్ పటేల్


ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు టీమిండియా పిలుపు అందింది. విండీస్ తో మిగతా రెండు వన్డేలకు గాను జాతీయ సెలక్టర్లు ఈ గుజరాత్ ఆటగాడిని ఎంపిక చేశారు. జూన్ లో బంగ్లాదేశ్ టూర్ కు ఎంపికైన ఈ బక్కపలుచని స్పిన్నర్ ఇటీవలే ముగిసిన చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలోనూ సత్తా చాటాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పటేల్ 5 మ్యాచ్ లలో 8 వికెట్లు తీసి సత్తా చాటాడు. మిగతా రెండు వన్డేలకు భారత జట్టు: ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), ధావన్, రహానే, విజయ్, కోహ్లీ, రాయుడు, రైనా, జడేజా, భువనేశ్వర్, ఇషాంత్, షమి, ఉమేశ్ యాదవ్, మిశ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. విండీస్ తో ఏకైక టి20 మ్యాచ్ కు భారత జట్టు: ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), ధావన్, రహానే, కోహ్లీ, రైనా, బిన్నీ, జడేజా, భువనేశ్వర్ కుమార్, షమి, సంజు శాంసన్, మనీష్ పాండే, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్.

  • Loading...

More Telugu News