: పిల్లల్లో చదివే సామర్థ్యంపై పరిశోధన


పిల్లలు తమ వయసు వారి కంటే చదువులో బాగా వెనుకబడడాన్ని డిస్లెక్సియా అంటారన్న విషయం తెలిసిందే. ఇదో వ్యాధిగానే పరిగణనలో ఉంది. పదాలను సరిగా గుర్తించలేకపోవడం, P అనే అక్షరాన్ని B గా చదవడం... 'పాట్' ను 'బాట్' అని చదవడం ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించవచ్చు. దీనిపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. చదవడం, రాయడం, నేర్చుకోవడం వంటి అంశాలు వారి మెదడులోని వైట్ మ్యాటర్ పరిమాణంపై ఆధారపడి ఉంటాయన్న నేపథ్యంలో... బాలల్లో వైట్ మ్యాటర్ అభివృద్ధి చెందే విధానాన్ని పరిశీలించడం ద్వారా వారి చదవగలిగే సామర్థ్యాలను అంచనా వేయొచ్చంటున్నారు పరిశోధకులు. దీనిపై పరిశోధనలు నిర్వహించిన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా అసోసియేట్ ప్రొఫెసర్ ఫ్యుమికో హాఫ్ట్ దీనిపై మాట్లాడుతూ, చిన్నారులు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించే కీలక సమయంలో, వైట్ మ్యాటర్ డెవలప్ అయ్యే విధానాన్ని పరిశీలించడం ద్వారా వారిలో చదివే సామర్థ్యం ఎంతన్నది తమ పరిశోధనల సాయంతో చూపగలమని చెప్పారు. కాగా, ఈ తరహా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు డాక్టర్లు నడతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఫ్యుమికో హాఫ్ట్ బృందం ఈ అధ్యయనానికి గాను 38 మంది బాలలపై పరిశోధనలు నిర్వహించింది. వారు థర్డ్ గ్రేడ్ కు వచ్చేవరకు వారి బ్రెయిన్ స్కానింగ్ లను పరిశీలించింది. ఎడమ చెవి వెనుక భాగంలో ఉండే టెంపోరో-పెరీటాల్ ప్రాంతంలోని హెమిస్ఫియర్ వైట్ మ్యాటర్ భాష, చదవడం, మాట్లాడడం వంటి అంశాలకు ఎంతో కీలకమని వారు గుర్తించారు. ముఖ్యంగా, చదివే సామర్థ్యాన్ని సూచిస్తుందని తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News