: ఫ్లిప్ కార్ట్ కు ఈడీ నోటీసు... వెయ్యి కోట్ల జరిమానా విధించే అవకాశం!


'ద బిగ్ బిలియన్ డే సేల్' పేరుతో పెట్టిన ఆఫర్ల నేపథ్యంలో ఈ-కామర్స్ జెయింట్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై వివరణ కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో, ఈ సంస్థకు ఈడీ రూ.1,000 కోట్ల జరిమానా విధించవచ్చని అంటున్నారు. గతవారం భారీ తగ్గింపు అమ్మకాలతో ఫ్లిప్ కార్ట్ పలు ఉత్పత్తులను ఆన్ లైన్లో పెట్టింది. ఈ క్రమంలో పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. స్పందించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, తగిన చర్యలు త్వరలోనే తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News