: 'మే హూ రజనీకాంత్' సినిమా టైటిల్ మారింది


'మే హూ రజనీకాంత్' పేరుతో హిందీలో తెరకెక్కిన చిత్రం టైటిల్ మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరును టైటిల్లో వినియోగించుకోవడంపై అభ్యంతరం తలెత్తడంతో 'మై హూ రజనీ'గా దర్శకుడు ఫైసల్ సైఫ్ మార్చారు. ఈ మేరకు దర్శకుడు మాట్లాడుతూ, "మా చిత్ర నిర్మాత చెన్నై వెళ్లి రజనీ సర్ లాయర్లకు సినిమాను చూపించారు. సినీ పరిశ్రమకు చెందని మరికొంత మంది గెస్టులు కూడా చూశారు" అని ఓ ప్రకటన విడుదల చేశాడు. తన పేరును టైటిల్లో ఉపయోగించడంపై రజనీకాంత్ కొన్ని రోజుల కిందట కోర్టును ఆశ్రయించారు. దాంతో, చిత్ర విడుదలపై కోర్టు స్టే విధించింది.

  • Loading...

More Telugu News