: నిత్యావసరాల కోసం తుపాను ప్రాంత ప్రజలు ఆందోళనపడొద్దు: చంద్రబాబు


విశాఖలో ఈ సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిత్యావసరాల కోసం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని... ఐదు, ఆరు జిల్లాల నుంచి కూరగాయలు కూడా తెప్పిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరలకే కూరగాయలు, ఉల్లిపాయలు కూడా అందిస్తామనీ అన్నారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. ఇక సహాయక శిబిరాల్లో ఉన్నవారికి బియ్యం, సరుకులు ఉచితంగా అందిస్తామన్నారు. ఇవాళ, రేపు కూడా శిబిరాల్లో ఉన్నవారికి ఆహారం సరఫరా చేస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు కావల్సినంత ఉన్నాయన్నారు. హెరిటేజ్, విశాఖ డెయిరీలను పాలు పంపిణీ చేయడానికి రమ్మని ఆదేశించినట్లు బాబు చెప్పారు. విశాఖలో కరెంటు లేని అపార్లమెంట్ల ట్యాంకర్లలోకి జనరేటర్ల ద్వారా నీటిని నింపుతున్నారన్నారు. సాయంత్రంలోగా మంచినీటి సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. పెద్ద జనరేటర్లు చాలా చోట్ల నుంచి తెప్పించామని, వాటితో విద్యుత్ సరఫరా చేస్తామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ పనులకు ప్రొక్లెయిన్లు పంపామన్నారు.

  • Loading...

More Telugu News