: వరంగల్ జిల్లాలో రైతుల ఆందోళన
తీవ్ర విద్యుత్ కోతలను నిరసిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో రైతులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. విద్యుత్ కోతలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ బాధలను పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధ్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.