: గిరిజ కోసం శోకసంద్రమైన మంచాల గ్రామం
రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజను వెలికి తీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు బోరుబావికి సమాంతరంగా 44 అడుగుల మేర తవ్వకాలు జరిపారు. అక్కడ నుంచి బోరుబావి వైపు తవ్వకాలు జరుపుతున్న సిబ్బందికి బండరాయి అడ్డు తగిలింది. దీంతో, గిరిజను వెలికి తీసే కార్యక్రమంలో స్వల్ప ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ క్రమంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు అధికారులు. చిన్నారి గిరిజ ఉదంతం మంచాల గ్రామస్తులను కన్నీటి పర్యంతం చేస్తోంది. గిరిజ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.