: 22కి చేరిన హుదూద్ మృతుల సంఖ్య
ఉత్తరాంధ్రపై విరుచుకు పడిన హుదూద్ తుపాన్ ధాటికి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. విశాఖపట్నం జిల్లాలో 15 మంది, విజయనగరం జిల్లాలో 6 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు తుపాను బీభత్సానికి బలయ్యారు. 6,836 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,833 పశువులు చనిపోయాయి. 181 పడవలు ధ్వంసమయ్యాయి. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.