: తుపాను బాధితులను ప్రవాసాంధ్రులు ఆదుకోవాలి: ఎన్నారై టీడీపీ పిలుపు


హుదూద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రవాసాంధ్రులు ఆదుకోవాలని ఎన్నారై టీడీపీ పిలుపునిచ్చింది. నిన్న సాయంత్రం కాలిఫోర్నియా ఫ్రీమాంట్ లోని పీఎన్ఎన్ టెక్నాలజీస్ సమావేశ మందిరంలో ఎన్నారై టీడీపీ నేతలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తుపానును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి... వెంటనే నిధులను విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఏపీ ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన కార్యాచరణ అమోఘమని కొనియాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయ కార్యక్రమాల పట్ల కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ తుపాను బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కొమ్మినేని, బాలాజీ దొప్పలపూడి, సాగర్ మన్నవ, రాంబాబు మందడపు, వెంకట్ కొడాలి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News