: కేసీఆర్ కు కోటి...మరి రైతులకు?: టీటీడీపీ


ఎకరా పొలం ద్వారా కోటి రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నానని చెప్పిన కేసీఆర్ రైతులకు కనీస గిట్టుబాటు ధర చెల్లించడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు విమర్శించారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, హరీష్ రావు గతంలో వ్యవసాయ మార్కెట్లకు వెళ్లి మంచి ధర ఇస్తామని రైతులకు చెప్పారని అన్నారు. పత్తి ధర గతేడాది 5,500 రూపాయలు ఉండగా ఇప్పుడు మూడు వేలకు పడిపోయిందని తెలిపారు. గిరిజనులను హెలికాప్టర్లలో తీసుకెళ్లి వైద్యం అందిస్తామని చెప్పిన కేసీఆర్, వారు విషజ్వరాలతో మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరిట అద్భుతాలు జరగకపోయినా, అనర్థాలు జరగకూడదని ఆయన సూచించారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా అసమర్ధులు అని కేసీఆర్ ఒప్పుకుంటున్నారని వారు తెలిపారు. తెలంగాణలో పుట్టి పెరిగిన లోకేష్ ను విమర్శిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News