: రెండు నెలల జీతం విరాళమిచ్చిన టీడీపీ ఎంపీలు


హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముందుకు వచ్చారు. తుపాను బాధితులకు సహాయమందించేందుకు రెండు నెలల జీతాన్ని విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నామని తెలిపారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. అలాగే తుపాను ప్రభావిత జిల్లాల ఎంపీల నిధుల నుంచి 25 లక్షల రూపాయలు సేకరించనున్నామని ఆయన వెల్లడించారు. ఇలా సుమారు 7 కోట్ల రూపాయలు సమకూరనున్నాయి. హుదూద్ తుపాను విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పెనువిపత్తును కలిగించింది.

  • Loading...

More Telugu News