: ఏం, బాబూ ఎలా ఉంది పరిస్థితి?... ఏం చెప్పమంటారు వెంకయ్య గారూ!
హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రాణ నష్టాన్ని అరికట్టగలిగినా, ఆస్తి నష్టాన్ని అరికట్టలేకపోయాము. దీంతో అంచనాకు అందని నష్టం వాటిల్లింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అంతులేని పంట నష్టం సంభవించింది. చూసేందుకు వరి మొన ఆనవాళ్లు కూడా లభించడంలేదు. చెట్లు మోడులుగా మిగిలాయి. చెరకు, అరటి పంటల గురించి చెప్పడానికి కూడా వీలు లేని స్థితిలో మిగిలాయి. ఇక ఉద్యానవన పంటలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు చర్యలు చేపట్టింది. ప్రజల నష్టాన్ని తక్షణం తీర్చలేకపోయినప్పటికీ ప్రజలవెంటే ప్రభుత్వం ఉందని చెప్పేందుకు చంద్రబాబు గవర్నమెంటు సాధ్యమైనంత కృషి చేస్తోంది. ముఖ్యమంత్రికి ప్రధాని, కేంద్ర హోం మంత్రి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సీఎంకి ఫోన్ చేసి విశాఖ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చీఫ్ విప్ ల సమావేశంలో పాల్గొనడానికి గోవా వెళ్లిన ఆయన అక్కడి నుంచే నేరుగా విశాఖ వస్తున్నట్టు తెలిపారు. రేపు మధ్యాహ్నం ప్రధాని విశాఖను చేరుకోనున్నారు.