: వెనక్కి తగ్గుతున్న 'హుదూద్'... రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు


'హుదూద్' తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఛత్తీస్ గఢ్ లో కేంద్రీకృతమైన తుపాను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెనక్కు తగ్గుతుందని తెలిపింది. దీని వల్ల రానున్న 24 గంటల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తరాంధ్రలో సుమారు 6 నుంచి 13 సెం.మీ.లు వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News