: హుదూద్ తుపాను నష్టం వెల్లడించిన ఎన్ డీఆర్ఎఫ్
హుదూద్ తుపాను నష్టంపై ప్రాధమిక అంచనాను ఎన్ డీఆర్ఎఫ్ బృందం వెల్లడించింది. వారి అంచనా ప్రకారం ఇప్పటి వరకు 1728 పశువులు మృతి చెందగా, 6,556 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొత్తం 109 రైలు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 5,565 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏడుగురు మృతి చెందారు. కాగా, ఇతర అంచనాలు రూపొందించాల్సి ఉంది. నష్టంపై ఎల్లుండికి పూర్తి అంచనాకు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.