: విశాఖలో పాల ధర లీటరుకు 80 రూపాయలు


హుదూద్ తుపాను ప్రభావంతో విశాఖపట్టణం వి'శోక'పట్టణం గా మారింది. నగరవాసులకు తుపాను తీవ్ర నష్టాల్ని, కష్టాల్ని తెచ్చిపెట్టింది. మూలిగే నక్క మీద తాటిపండులా స్థానిక వ్యాపారులు సామాన్యులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెట్రోల్ బంకులు, కిరాణా, కూరగాయల దుకాణాలు, పాల బూత్ ల వద్ద జనాలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా రిటైల్ వ్యాపారులు నిత్యావసరాలు ధరలను అమాంతం పెంచేశారు. డిమాండ్ ను మరింత పెంచడానికి బ్లాక్ మార్కెటింగ్ కు కూడా పాల్పడుతున్నారు. దీంతో, విశాఖలో కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు మొదలైనవాటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. లీటర్ పాల ధర రూ. 80 కు చేరుకుంది. తుపానుకు ముందు ఉల్లి ధర కిలో రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.50 కు పెంచేశారు. అలాగే, సింగిల్ వాటర్ ప్యాకెట్ ధర 5 రూపాయలకు చేరుకుంది. ఇవే కాదు, చాలా నిత్యావసరాల ధరలు రెండింతలు, మూడింతులు పెరిగిపోయాయి. స్థానిక వ్యాపారులే తమకు చుక్కలు చూపెడుతుండడంతో విశాఖ వాసులు లబోదిబోమంటున్నారు.

  • Loading...

More Telugu News