: బాలీవుడ్ బాక్సాఫీస్ ను 'బ్యాంగ్ బ్యాంగ్' చేస్తున్న హృతిక్
బాలీవుడ్ బాక్సాఫీస్ ను స్టార్ హీరో హృతిక్ రోషన్ ఊపేస్తున్నారు. తను హీరోగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 291 కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా భారత్ లోనే 154.68 కోట్ల రూపాయలు (గ్రాస్ రూ.221 కోట్లు) వసూలు చేసింది. 140 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా ఓవర్సీస్ లో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్ దేశాల్లో ఈ సినిమా అభిమానుల ఆదరణ చూరగొంటోంది.