: హుదూద్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రఘువీరా


ఉత్తరాంధ్రపై విరుచుకుపడి, విశాఖను అల్లకల్లోలం చేసిన హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇళ్లు, పంటను కోల్పోయిన వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేవారు. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. తమ జీవనాధారమైన పడవలు, వలలను కోల్పోయిన మత్స్యకారులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News