: 'ఐ', 'రోబో', 'టెర్మినేటర్' సినిమాల్లో చూపింది వాస్తవరూపం దాల్చుతుందా?


రోబోలకు కృత్రిమ మేధస్సు అందిస్తే అది మానవాళి మనుగడకే ముప్పు అంటున్నారు వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. 'ఐ', 'రోబో', 'టెర్మినేటర్' సినిమాల్లో చూపించింది వాస్తవరూపం దాల్చుతుందని హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఈ కెనడియన్-అమెరికన్ వ్యాపారవేత్త శాస్త్ర సాంకేతిక రంగాలపై విపరీతమైన ఆసక్తి చూపుతారు. అంతరిక్ష పరిశోధనల సంస్థ స్పేస్ ఎక్స్, పేపాల్, సోలార్ సిటీ... ఇలా ఎన్నో సంస్థలను నడిపిస్తున్నారాయన. ఇటీవలే ఓ కార్యక్రమంలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ, రోబోలకు మరింత మెరుగైన కృత్రిమ మేధస్సు అందిస్తే, అది మానవ జాతి వినాశనానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. రోబోలు మరింత శక్తిమంతంగా తయారై మానవాళిని తుడిచిపెట్టేస్తాయని వివరించారు. కృత్రిమ మేధస్సుపై పరిశోధనలు శరవేగంగా సాగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ ఆగస్టులో ఈ విషయమై కొన్ని ట్వీట్లు కూడా చేశారు. రోబోలకు అందించే కృత్రిమ మేధస్సు అణ్వాయుధాల కన్నా పవర్ ఫుల్ గా మారొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News