: హుదూద్ ప్రభావంతో ఐదు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను ఇప్పుడు మరో ఐదు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. ఒడిషా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి ప్రళయంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News