: ఏపీకి అన్ని విధాలా సహకరిస్తాం: కేసీఆర్
హుదూద్ తుపానుతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్ని విధాలా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సీఎస్ కు సమాచారం అందించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రాజీవ్ శర్మ ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అంతేకాకుండా, ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చిన కేసీఆర్... తుపాను పరిస్థితిపై ఉత్తర తెలంగాణ కలెక్టర్లతో సమీక్షించారు. రాష్ట్రంలోని పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు కేసీఆర్ వివరించారు.