: ఏపీకి ఆపన్నహస్తం అందిస్తామంటున్న కేసీఆర్
ఉత్తరాంధ్రను హుదూద్ తుపాను కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాదు తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో తుపాను బీభత్సంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి అన్ని రకాలుగా సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ఏపీ సర్కారుకు తెలియజేయాలని ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు.