: హైదరాబాద్- విశాఖ మధ్య రైళ్ల రాకపోకలు బంద్!


హుదూద్ తుపాను నేపథ్యంలో ఆది, సోమవారాల్లో హైదరాబాద్-విశాఖల మధ్య రైళ్ళను నిలిపివేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హుదూద్ తుపాను కారణంగా 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలను నిలిపివేశామని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం నాటి పరిస్థితిని పరిశీలించి రైళ్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News