: 'ఎస్ఏజీవై' గ్రామస్థులకు రోజువారీ శారీరక కసరత్తు తప్పనిసరి!


కేంద్ర ప్రభుత్వ పథకం ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ కింద ఎంపికయ్యే గ్రామస్థులకు ఇకపై రోజువారీ శారీరక కసరత్తు తప్పనిసరి. ఒంటరిగానైనా, బృందాలుగానైనా తప్పనిసరిగా గ్రామంలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ శారీరక కసరత్తులు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మోడల్ విలేజ్ పథకంలో ఈ కార్యక్రమమే కీలకమని కూడా కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. శారీరక కసరత్తులో భాగంగా గ్రామస్థులు వారికిష్టమైన కసరత్తులను ఎంచుకునే వెసులుబాటు ఉందట. యోగా, నడక, జాగింగ్, జిమ్, మరేవైనా క్రీడాంశాల్లో పాల్గొనవచ్చని కేంద్రం వెల్లడించింది. క్రమం తప్పని కసరత్తులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని, ఇది ఆయా గ్రామాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. శారీరక కసరత్తుల కోసం అవసరమయ్యే సదుపాయాలను కూడా కేంద్రం కల్పించనుంది. ఎంపీల్యాడ్స్ తో పాటు పలు పథకాల కింద మంజూరయ్యే నిధులు, ఆయా రాష్ట్రాల నిధులను వెచ్చించి, గ్రామాల్లో పార్కులు, క్రీడా మైదానాలతో పాటు జిమ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజువారీ శారీకర కసరత్తులతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా మోడల్ విలేజ్ ప్రజలు అధిక ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం చెబుతోంది.

  • Loading...

More Telugu News