: ఎటుచూసినా విధ్వంసమే... ఇదీ వైజాగ్ ప్రస్తుత పరిస్థితి!


హుదూద్ తుపాను విశాఖపై విరుచుకుపడింది. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, హోర్డింగ్ లు విరిగి పడడంతో భారీ సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. అపార్ట్ మెంట్ల గోడలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రాణనష్ట నివారణ నిమిత్తం శనివారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. అటు, సెల్ ఫోన్ సిగ్నళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేవీ కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం దెబ్బతిన్నది.

  • Loading...

More Telugu News