: సరిహద్దులో కాల్పులకు భారతే కారణం: ఐరాసకు పాక్ ఫిర్యాదు


అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారతే కారణమని ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తాజ్ అజీజ్ ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ కు లేఖ రాశారు. ‘‘గడచిన వారం రోజులుగా నియంత్రణ రేఖ వెంట భారత సైన్యం, కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలిస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఈ కారణంగానే సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నానాటికీ ఇక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మా అభ్యంతరాలను భద్రతాసమితిలో పెట్టడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపించండి’’ అంటూ సర్తాజ్ అజీజ్ ఆ లేఖలో బాన్-కీ-మూన్ ను అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News