: అప్పుడే ముగ్గుర్ని బలిగొన్న హుదూద్
హుదూద్ తుపాను పంజా విసిరింది. దాని ధాటికి కోస్తా తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. విరుచుకుపడుతున్న హుదూద్ తుపాను ధాటికి విశాఖ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇంటి పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా, బహిర్భూమికి వెళ్లినప్పుడు తాడి చెట్టు విరిగి పడటంతో మరొకరు చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్టు విరిగి మీద పడటంతో ఒకరు మృతి చెందారు.