: విశాఖకు 70 కి.మీ. దూరంలో హుదూద్
విధ్వంసక హుదూద్ తుపాను విశాఖ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ప్రస్తుతం, విశాఖ తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హుదూద్ తీరం దాటే సమయంలో 180 నుంచి 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది చెట్లు కూకటి వేళ్లతో కూలిపోయాయి. కరెంట్ స్తంబాలు కూడా పడిపోయాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో హుదూద్ తీరం దాటే అవకాశం ఉంది.