: చంద్రబాబు నివాసం నుంచి గంటగంటకూ బులెటిన్ విడుదల
హుదూద్ తుపానుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తన నివాసంలోనే తుపాను పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తుపాను కదలిక, సహాయక చర్యలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తుపాను పరిస్థితిపై గంటగంటకూ చంద్రబాబు నివాసం నుంచి బులెటిన్ వెలువడనుంది.