: మోడీ! గుజరాత్ నుంచి బయటకు రా... పని చెయ్: చిదంబరం
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ వలయం నుంచి బయటకు రావాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సూచించారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పని చేయడం ప్రారంభించకుండా ఎన్నికలంటూ తిరగడం భావ్యం కాదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మావోయిస్టులు విజృంభిస్తుంటే, సరిహద్దుల్లో పాక్, చైనాలు పేట్రేగిపోతున్నాయని ఆయన సూచించారు. దేశంలో సమస్యలు పరిష్కరించడం మానేసి మోడీ గుజరాత్ జపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ కొత్తగా ఏమీ చేయడం లేదని, కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నారని ఆయన విమర్శించారు. పలు అంశాల్లో ఎన్డీయే వైఖరి ఏంటని ఆయన ప్రశ్నించారు.