: రాణించిన కోహ్లీ, రైనా, ధోనీ...టీమిండియా 263/7
రెండో వన్డేలో టీమిండియా పరువు నిలబెట్టుకునేలా జాగ్రత్తగా ఆడింది. తొలి వన్డే ఘోరపరాజయంతో మేల్కొన్న టీమిండియా టాపార్డర్ కాస్త జాగ్రత్తగా ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. విండీస్ కు 264 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. ఓపెనర్లు ధావన్, రహానే విఫలమవడంతో రాయుడు విండీస్ బౌలర్లను ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. నిలదొక్కుకుంటున్నాడన్న దశలో రాయుడు అవుటయ్యాడు. దీంతో పరుగుల వేగం మందగించింది. నెమ్మదిగా పరుగుల వేగం పెంచిన కోహ్లీ (62), రైనా (62) అర్ధసెంచరీలు చేసి ఒకరి తరువాత ఒకరు వెనుదిరిగారు. దీంతో కెప్టెన్ ధోనీ టైయిలెండర్ల సాయంతో తనదైన శైలిలో ఆడుతూ అర్ధసెంచరీ సాధించాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లతో రాణించగా, రవి రాంపాల్, బెన్, బ్రావో, సమీ చెరోవికెట్ తీసి తోడ్పాటునందించారు.