: మీకు చేత కాకపోతే... విద్యుత్ శాఖను మాకు అప్పగించండి: ఎర్రబెల్లి


తెలంగాణలో తీవ్ర విద్యుత్ సమస్యకు టీఆర్ఎస్ నేతలే కారణమని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడం ప్రభుత్వానికి చేతకాకపోతే... విద్యుత్ శాఖను నెల రోజుల పాటు టీడీపీకి అప్పగించాలని... సమస్యను తాము రూపుమాపుతామని ఛాలెంజ్ చేశారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తామని... అలాకాని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటామని అన్నారు. విద్యుత్ పై చర్చించడానికి టీఆర్ఎస్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ప్లేస్... సమయం టీఆర్ఎస్ నేతలే ఫిక్స్ చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News